దొంగల బీభత్సం.. కత్తితో గొంతు కోసి..

by Aamani |
దొంగల బీభత్సం.. కత్తితో గొంతు కోసి..
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కిరాణం షాపులో చొరబడిన దొంగలు నానా బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం అర్ధరాత్రి పగడాల సుమలత ఇంటి బయటకు రాగా గమనించిన ముగ్గురు వ్యక్తులు మహిళను కత్తితో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు. భర్త తిరుపతి బయటకు రాగా అతనిని కొట్టి కట్టివేశారు. మహిళను కొట్టడంతో పాటు కత్తితో బెదిరించి గొంతు కోశారు. ఇంట్లో గల రూ.లక్ష నగదు తో పాటు అతని మోటార్ సైకిల్ ని తీసుకు వెళ్లినట్లు యజమానులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగలు 353 సి భూపాలపల్లి - కాళేశ్వరం రహదారిపై ఉన్న బస్సాపూర్ గ్రామంలో దుకాణం లో ముగ్గురు వ్యక్తులు చొరబడి అందుబాటులో ఉన్న వస్తువులను డబ్బులను, దోచుకున్న సంఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది.

దొంగలు బీభత్సం సృష్టించిన సమాచారాన్ని వెంటనే బాధితులు పోలీసులకు తెలిపారు. దొంగలు సుమలతను కత్తితో గొంతు కోయడంతో గాయపడిన మహిళ పగడాల సుమలత చికిత్స కోసం భూపాలపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్సై అభినవ్ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుల ఆనవాళ్ల కోసం జాగిలాలతో పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.దొంగలను పట్టుకునేందుకు జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ న పరిశీలిస్తున్నట్లు డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ నాగార్జున రావు తెలిపారు.

Advertisement

Next Story