- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాత్రిపూట తాళం వేసిన దుకాణాలే వారి టార్గెట్..రెక్కీ చేస్తూ..
దిశ,షాద్ నగర్ : రాత్రి పుట తాళం వేసిన దుకాణాలను టార్గెట్ చేస్తూ రెక్కీ నిర్వహించారు. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా లోని ఆరుగురు సభ్యుల్లో ఇద్దరినీ బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు దొంగలను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ గంగాధర్,అనిల్,హనుమంత్,పృద్వి రాజ్,అభి,శశి అనే ఆరుగురు ముఠా సభ్యులు ఉన్నారని,వీరిని గంగాధర్ అనే వ్యక్తి లీడ్ చేస్తున్నాడన్నారు.
వీరు ఆరుగురు కలిసి రాత్రి వేళలో తాళం వేసిన షాప్ లను టార్గెట్ చేస్తూ దొంగతలకు పాల్పడుతున్నారని ఈ క్రమంలో ఈ నెల 19 వ తేదీన షాద్ నగర్ పట్టణంలో నాలుగు షాప్ లలో దొంగతనం చేశారని,అదే విధంగా షాబాద్ లో రెండు షాప్ లలో,మొయినాబాద్ లో ఒక షాప్ లో,బెంగుళూరు లో మూడు షాప్ లలో దొంగతలకు పాల్పడుతూ చోరీ చేసిన డబ్బులతో జల్సాలకు,ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని వీరిలో గంగాధర్,అనిల్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా టెక్నీకల్ ఎవిడెన్స్ ఆధారంగా హనుమంత్ రాజు,పృద్వి రాజ్ లను షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారని ,వీరి వద్ద నుంచి రూ.10వేలు సీజ్ చేశామని తెలిపారు. మిగతా సొమ్మును రికవరీ చేసి నష్టపోయిన షాప్ యజమానులకు అందజేస్తామని తెలిపారు.