- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్ఎంపీ వైద్యం వికటించి చికిత్స పొందుతూ బాలిక మృతి
దిశ,ముత్తారం: ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఆర్ఎంపీ వైద్యం వికటించి, చికిత్స పొందుతూ హైదరాబాద్ లో బాలిక మృతి చెందినట్లు తెలిసింది. ఖమ్మం పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి ప్రసన్న (17) కు ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. ఈనెల 10వ తేదీన జ్వరంతో ఉన్న ప్రసన్నకు తండ్రి నారాయణ ఖమ్మం పల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బుద్దె రమేష్ వద్ద వైద్యం చేయించగా ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల జ్వరం ఎక్కువ అయింది. దీంతో హైదరాబాద్ కు తరలించగా అక్కడి వైద్యులు ఇంజక్షన్ వికటించడం వల్ల పరిస్థితి విషమించిందని తల్లిదండ్రులకు తెలిపారు. బుధవారం ఉదయం మృతి చెందడంతో హైదరాబాద్ నుండి మృతురాలని తీసుకువస్తున్నారు. ప్రసన్న మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణం అంటూ కుటుంబ సభ్యులు వైద్యుడు ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.