తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి

by Aamani |
తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆదివారం ఉదయం తండ్రి మరణించిన విషయాన్ని బంధువులకు కుటుంబ సభ్యులకు తెలియజేస్తూనే... ఓ కొడుకు కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్ పట్టణంలోని ఆస్రా కాలనీకి చెందిన రిటైర్డ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి జహూర్ అలీ ఖాన్ (73) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం నివాసంలోనే మృతి చెందారు.

తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు అబిద్ అలీ ఖాన్ (50) బంధువులకు మిత్రులకు సమాచారం చేరవేస్తూనే కుప్పకూలిపోయాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురై ఇంట్లోనే పడిపోయాడు కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందాడు ఒకే రోజు తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ సంఘటన నిర్మల్ పట్టణంలో విషాదాన్ని నింపింది.

Advertisement

Next Story