కోట్లు కొట్టేసి పరారైన బ్యాంకు మేనేజర్... ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

by Aamani |
కోట్లు కొట్టేసి పరారైన బ్యాంకు మేనేజర్... ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
X

దిశ, నూతనకల్ : బ్యాంకు ఖాతాదారులను నమ్మించి రూ. కోట్లు కొట్టేసి పరారీలో ఉన్న బ్యాంకు మేనేజర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. వివరాల్లోకి వెళితే నూతనకల్ మండల పరిధిలోని తాళ్ళసింగారం గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గతంలో పనిచేసిన మేనేజర్ సంఘీ హరి ప్రసాద్ వివిధ రుణాల పేరుతో బ్యాంకు ఖాతాదారులను మోసం చేసి రూ. 2,05,35,350 నగదును తనకు చెందిన అపెక్స్ బ్రిక్స్ కంపెనీకి, తన సొంత అవసరాలకు వాడుకున్నాడని తర్వాత వచ్చిన మేనేజర్ రవీంద్ర ఫిర్యాదు మేరకు గత మార్చి నెలలో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ రవి, తుంగతుర్తి సీఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని రామంతపూర్ లో అరెస్టు చేసి, రిమాండ్ కు పంపామని ఎస్సై మహేంద్రనాథ్ తెలిపారు.

Advertisement

Next Story