తాను లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుందనే అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త

by Mahesh |
తాను లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుందనే అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి సమాజంలో అనుమానపు హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, అనుమానం పచ్చని సంసారాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన సూర్యచంద్రం, సాయి లక్ష్మి దంపతులు. అయితే గత కొంత కాలంగా భార్య సాయి లక్ష్మీ తాను ఇంట్లో లేని సమయంలో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడటం భర్త గమనించాడు. అయితే మొదట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుందని భావించాడు. అయితే సాయి లక్ష్మీ వారి ఫ్యామిలీకి కాకుండా వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రోజు కూడా అలాగే ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన సూర్యచంద్రం.. ఇంట్లో ఉన్న వేట కత్తితో భార్యను దారుణంగా ఇంటి ముందు హత్య చేశారు. అనంతరం నిందితుడు కత్తిని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story