విద్యుత్ షాక్‌కి గురై విద్యార్థి మృతి

by Jakkula Mamatha |
విద్యుత్ షాక్‌కి గురై విద్యార్థి మృతి
X

దిశ,ఏలూరు:ఆడుతూ పాడుతూ బడికెళ్లే వయసులో బతుకును కరెంట్ వైర్ రూపంలో బలి తీసుకుంది. ఒక్కగానొక్క కొడుకు మరణించారని తెలిసి తల్లి భోరు భోరున విలపిస్తోంది. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండల కేంద్రంలో పాత పోలవరం గ్రామానికి చెందిన కోవేటి ప్రసాద్ ( 11) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం కడెమ్మ స్లూయిజ్ వద్ద ఆడుకుంటూ పాండురంగడి గుడి స్లోప్ లో దిగుతుండగా కాలు జారి పడ్డాడు. స్లూయిజ్ నీటిలో పడకుండా ఉండేందుకు అక్కడే తెగి వేలాడుతున్న కరెంట్ వైర్ ని పట్టుకున్నాడు.

దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి తండ్రి పోసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ ప్రమాదంపై విద్యుత్ శాఖ ఏఈ కొండ సత్యనారాయణ ని వివరణ కోరగా తెగిపడిన వైరు న్యూట్రల్ వైరని చెప్పారు. సాధారణంగా నేల మీద అయితే ఎలాంటి ప్రమాదం ఉండదని నీటిలో పడటం వలన విద్యుత్ ప్రసరించి షాక్ కు గురైనట్లు ధ్రువీకరించారు. విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన బాలుడి కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు .

Advertisement

Next Story

Most Viewed