బెల్ట్​షాపుపై ఎస్ఓటీ పోలీసులు దాడి

by Sridhar Babu |
బెల్ట్​షాపుపై ఎస్ఓటీ పోలీసులు దాడి
X

దిశ,వలిగొండ : మండలంలోని చిత్తాపురం గ్రామంలోని కిరాణం షాపులో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ఎస్వోటీ పోలీసులు దాడి చేసి సుమారు 13 వేల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిత్తాపురం గ్రామానికి చెందిన బీమాగాని రంగయ్య కిరాణం షాపు నడిపించుకుంటూ జీవిస్తున్నాడు.

ఆయన కిరాణం షాపులో అక్రమంగా మద్యం నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు దాడి చేసి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన సుమారు 13 వేల రూపాయల విలువైన 18 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై డి.మహేందర్ లాల్ తెలిపారు.

Advertisement

Next Story