నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టివేత

by Sridhar Babu |
నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టివేత
X

దిశ,టేకులపల్లి : నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న సంఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్సై పి.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం టేకులపల్లి మండల కేంద్రం కేసీఆర్ కాలనీ ఎదురుగా ఉన్న అనబత్తుల కోటేశ్వరరావు గోడౌన్లో విశ్వసనీయ సమాచారం చేరకు ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా అక్రమంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నట్టు గుర్తించి వాటిని పట్టుకొని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ రమణ, భాను, సాగర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story