పెట్టుబడుల ముసుగులో మోసం

by Sridhar Babu |
పెట్టుబడుల ముసుగులో  మోసం
X

దిశ, హనుమకొండ : దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగులో ప్రజలను నమ్మించి కోట్లల్లో సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ కు చెందిన సైబర్‌ నేరగాన్ని వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం దేగానా పట్టణానికి చెందిన కాలు రామ్ (33) గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బును తిరిగి పొందవచ్చని దేశ వ్యాప్తంగా ప్రజలను నమ్మించి మోసం చేసి కోట్లల్లో డబ్బు కొల్లకొడుతున్నాడు. దేశ వ్యాప్తంగా పన్నెండుకు పైగా, తెలంగాణ రాష్ట్రంలో రెండు నేరాలకు పాల్పడ్డాడు.

ఈ సైబర్ నేరస్తుడు ఇటీవల హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడిని నమ్మించి అతని ద్వారా ఆన్ లైన్ లో 21 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్లుగా గుర్తించిన సదరు బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించగా సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్​కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నిందితుడి ఆచూకీ కనుగొని రాజస్థాన్ లో అరెస్టు చేసి వరంగల్‌ కమిషనరేట్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, ఇన్​స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్‌ఐలు చరణ్‌, శివకుమార్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, కానిస్టేబుళ్లు కిషోర్ కుమార్, ఆంజనేయులు, రాజుతో పాటు ఇతర సైబర్ విభాగం సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed