గంజాయి అమ్ముతున్న ఐదుగురు మహిళల అరెస్ట్..

by Aamani |
గంజాయి అమ్ముతున్న ఐదుగురు మహిళల అరెస్ట్..
X

దిశ,కార్వాన్ : అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి ఆడ, మగ తేడా లేకుండా పోయింది. ఈజీ మనీ వస్తుందంటే చాలు అడ్డదారులు నడవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. నిషేధిత మాదకద్రవ్యాలు గా ఉన్న గంజాయిని అంగడి సరుకుగా అమ్మకానికి సిద్ధపడిన ఐదుగురు మహిళలను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. అయిదుగురు మహిళల వద్ద 11.3 కేజీల గంజాయిని ధూల్ పేట్ ఆపరేషన్ టీం లీడర్ ఇన్ అంజిరెడ్డి టీం సభ్యులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... లోయర్ దూల్పేట్ లో జుంగూర్ బస్తీ లో కమలా బాయ్ అనే మహిళ అమ్మకాలు సాగిస్తుండగా ఆమెను పట్టుకున్నారు.

ఇలా ఐదుగురు మహిళల వద్ద మొత్తంగా 11.3 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి అమ్మకాలు సాగిస్తూ పట్టుబడిన వారిలో కమలాబాయి, దుర్గా సింగ్, దివ్య సింగ్, దీక్ష సింగ్, నేహా సింగ్ లు ఉన్నారు. వీరికి గంజాయి సరఫరా చేసినటువంటి ప్రధాన నిందితులు దీపికా సింగ్ మహేష్ సింగ్ సంగీత సింగులు సప్లయర్గా ఉన్నారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టువంటి టీంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ఎన్. అంజిరెడ్డి తో పాటు సిఐలు గోపాల్, కోటమ్మలు, ఎస్సైలు విష్ణు గౌడ్, మధు, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్ రెడ్డి, శ్రీధర్, అజీమ్ లతోపాటు ప్రకాష్, మహేష్, రాకేష్ కానిస్టేబుల్ గా ఉన్నారు. గంజాయి పట్టుకున్న టువంటి టీం ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు.

Advertisement

Next Story