హైదరాబాద్ గాజులరామారంలో కాల్పుల కలకలం

by Gantepaka Srikanth |
హైదరాబాద్ గాజులరామారంలో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గాజులరామారంలో కాల్పులు కలకలం రేపాయి. బుధవారం సాయంత్రం ఎల్‌ఎన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. బైక్‌లో పెట్రోల్ దొంగిలించేందుకు ముగ్గురు ప్రయత్నించగా.. క్వాషియర్ అఖిలేష్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతనిపై గన్‌లతో కాల్పులు జరిపారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పారిపోయినట్లు సమాచారం. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed