100 కి కాల్ చేసి మరీ కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
100 కి కాల్ చేసి  మరీ కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం
X

దిశ, కొండపాక : 100 కి కాల్ చేసి మరీ కత్తితో పొడుచుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుకునూర్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల గ్రామం లో శుక్రవారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ ఐ పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఎరుకుల రాజయ్య గౌడ్ కొడకండ్ల గ్రామం వద్ద ఉండి 100 కి కాల్ చేసి కత్తి తో పొడుచుకొని చనిపోతున్నానని తెలపడంతో వెంటనే కుకునూర్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని చూడగానే రాజయ్య రక్తం మడుగలో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులు 108 అంబులెన్స్ సహాయం తో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story