crime news : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడి మృతి..

by Sumithra |
crime news : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడి మృతి..
X

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెం గ్రామంలో ఓ బాలుడు సోమవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించినట్లు ఎల్ఎండి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మొగిలి పాలెం గ్రామానికి చెందిన జవ్వాజి సాయి కృష్ణ (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

సోమవారం మధ్యాహ్నం స్కూల్లో ఉన్న తన స్నేహితులతో కలిసి గ్రామంలోని చెరువు సమీపంలో బహిర్భూమికి వెళ్ళాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి దుర్మరణం చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story