గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్..

by Aamani |
గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలో బైపాస్ రోడ్ లో నిషేధిత గంజాయి ని అమ్ముతున్న యువకుడిని మంచిర్యాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బుధవారం పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం , బ్లూ కోర్టు సిబ్బంది పెట్రోలింగ్ చేసే సమయం లో బైపాస్ రోడ్ లో అనుమానాస్పదం గా తిరుగుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ధ గంజాయి ఉన్నట్లు గ్రహించి వారి నీ విచారణ చేయగా వారి పేర్లు శ్యామ్,అరుణ్ గా తెలిపారు.జల్సాలు ,డబ్బులు అక్రమ మార్గంలో సంపాదించేందుకు అలవాటు పడి, బల్లర్ష నుండి మంచిర్యాల కు తక్కువ ధరకు తీసుకొచ్చి మంచిర్యాలలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.గంజాయి సరఫరా చేస్తున్న శ్యామ్, విక్రయించేందుకు అతడి వద్దకు వచ్చిన అరుణ్ నీ ఇద్దరిని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వారి వద్ద నుంచి అరకిలో గంజాయి ,2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.



Next Story