రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం..ముగ్గురి పరిస్థితి విషమం

by Aamani |
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం..ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ, కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గేటు వద్ద మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా పలువురు గాయపడినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఓవర్టేక్ చేసే కారులో కామారెడ్డి జిల్లా పోచారం మండలం చిన్న దుర్గ గ్రామానికి చెందిన అశ్విని (32) అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలితో పాటు కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాదులోని ఆసుపత్రికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంతోషిదేవి, గంగు రమాదేవి, దేహార్థి చౌదరి, బీరుగొండ మరి కొంతమంది గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కౌడిపల్లి పోలీసులు నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నుజ్జునుజ్జయిన కార్లను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను స్థానిక పోలీసులు క్లియర్ చేశారు.

Advertisement

Next Story