- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైన్స్‌లలో వరుస దొంగతనాలు.. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
దిశ ప్రతినిధి, నిర్మల్ : గత కొన్ని రోజులుగా వైన్స్ లు టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా ను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. నిర్మల్ సోఫీ నగర్ లోని సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ లో దొంగతనానికి పాల్పడిన నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక వైయస్సార్ కాలనీలో నివాసముండే రాపెన్వాడ్ రఘు, ఉత్తం పాండురంగ పవర్, మక్కల శ్రీను, జాదవ్ దిలీప్, రాపని సోనీ లు ముఠాగా ఏర్పడ్డారు. రోజు సాయంత్రం వారి పనుల అనంతరం కలిసి మద్యం తాగేవారు.
రోజు వారీ కూలీ పని చేసే వచ్చే డబ్బులతో మద్యం త్రాగుటకు, జల్సాలకు అలవాటు పడ్డారు. కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో జల్సాలకు డబ్బులు, మద్యం కావాలంటే వైన్ షాప్ లో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు. మొదటగా పథకం ప్రకారం స్థానిక మయూరి హోటల్ వద్ద గల శ్రీ వేంకటేశ్వర వైన్స్, ఖానాపూర్ రోడ్ లోని సిరి వైన్స్ లో దొంగతనం చేశారు. అదే ప్రకారంగా మంగళవారం అర్ధరాత్రి సోఫీ నగర్ లో ఉన్న సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ లో దొంగతనానికి వెళ్లి రెస్టారెంట్ లో ఉన్న కెమెరాలు దానికి సంబంధించిన టివి ని పగలగొట్టి తలుపు, షట్టర్ తాళాలు కూడా రాడ్లతో పగులగొట్టి కౌంటర్ లో ఉన్న రూ. 40 వేల నగదు, ఒక కంప్యూటర్ కొన్ని మద్యం బాటిళ్ళు దొంగలించారు.
కేసు నమోదు చేసిన నిర్మల్ పట్టణ పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీసీఎస్ పోలీసుల సహకారంతో కేవలం 24 గంటల్లో దొంగతనం చేసిన రాపెన్వాడ్ రఘు,ఉత్తం పాండురంగ పవర్,మక్కల శ్రీను, జాదవ్ దిలీప్ లను చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకుని విచారించగా వారు చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనం చేసిన డబ్బులుని జల్సాలకు ఖర్చు చేశామని తెలిపారు. వారి వద్ద నుండి రెండు వేల రూపాయలు స్వాధీనపరచుకొని రిమాండ్ కు పంపారు. నిందితులలో రాపని సోనీ పరారి లో ఉన్నదని తెలిపారు. నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.