sexually assaults : మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడి

by Sridhar Babu |
sexually assaults : మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడి
X

దిశ,తల్లాడ : ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడి చేసిన సంఘటన ఆదివారం తల్లాడ మండలంలో జరిగింది. ఎస్సై బి.కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడ మండలం వెంకటరాముని తండా గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మాలోతు వినోద్ (16) అదే గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల బాలిక వీధిలో ఆడుకుంటుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను ఎత్తుకొని తన ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యం చేస్తుండగా ఆ సమయంలో బాలిక అన్నయ్య

చూసి తల్లికి చెప్పడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి అక్కడకు చేరుకుంది. ఇది గమనించిన వినోద్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న తల్లాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితున్ని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed