- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
దిశ,మల్కాజిగిరి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరుతో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగాలు , డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డి తో పాటు మరో ఐదుగురు నిందితులను మల్కాజిగిరి, కీసర ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 98 నకిలీ రెండు పడక గదుల కేటాయింపు పత్రాలు, కీసర ఆర్ డి ఓ స్టాంప్ లు, రూ. 1 లక్ష 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు శుక్రవారం వెల్లడించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో రూ.1.29 కోట్లు కాజేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 108 మందిని మభ్య కోట్లు దండుకున్నారు.
కేసులో కుషాయిగూడకు చెందిన సురేందర్‌రెడ్డి ప్రధాన సూత్రదారీగా ఉన్నట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ముఠాలోని అనుగు హర్షిని రెడ్డి ఆర్డీవో అంటూ రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తానని పలువురిని నమ్మించింది. ఇదే తరహాలో పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారు. కొందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు నకిలీ పత్రాలను తయారు చేశారు. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డితో తనకు సన్నిహితుడనీ చెబుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని సురేందర్‌రెడ్డి పలువురిని నమ్మించి కోట్లు దండుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం.