శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణం.. అంతలోనే మరణం

by Aamani |
శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణం.. అంతలోనే మరణం
X

దిశ, షాద్ నగర్ : ఆగి ఉన్న కంటైనర్ ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని విఠల పుర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ అతని (35) అతని భార్య సునీత (28) ఇద్దరు కలిసి బుధవారం హైతాబాద్ లోని వెంకటాపూర్ ఫంక్షన్ హాల్ లో బంధువుల ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఎలికట్ట చౌరస్తాలో ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టింది.ఈ ఘటనలో భర్త మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సునీత కు రెండు కాళ్ళు విరిగాయి.సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహేష్ మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story