నేరేడుచర్లలో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులు అరెస్ట్..

by Aamani |
నేరేడుచర్లలో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులు అరెస్ట్..
X

దిశ, నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలో శివాజీ నగర్ లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నేరేడుచర్ల ఎస్సై ఎ.రవీంద్ర ఆదివారం రాత్రి తెలిపారు. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల పట్టణంలోని శివాజీ నగర్ ఎస్సీ కాలనీలో ఉంటున్న మచ్చ రవీంద్ర ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి ఆ పేకాట స్థావరంపై దాడి చేసి ఆ పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద రూ.13970 నగదు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed