- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే బాల రాముడి ప్రాణ ప్రతిష్ట.. పూజలో పాల్గొననున్న14 జంటలు
దిశ, వెబ్‌డెస్క్: బాల రాముడి ప్రాణప్రతిష్ట క్రతువు సందర్భంగా ఆధ్యాత్మిక నగరం అయోధ్యను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 10 లక్షల దీపాలతో ఆలయ పరిసరాలను అలంకరించబోతున్నారు. సరిగ్గా రేపు మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే, ఈ క్రతువులో 14 జంటలు పాల్గొనబోతున్నారు. మీగతా పూజలు అటుంచింతే.. 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ట క్రతువు కొనసాగనుంది. బాలా రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కారు. గర్భ గుడిలో 51 అంగుళాల ఎత్తుతో బాల రాముడు కొలువుదీరనున్నాడు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గాను 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడెల్పు గల పాలరాతి సిహాసనాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే అయోధ్యకు వేలాది మంది సాధువులు, భక్తులు చేరుకుంటున్నారు. వారి కోసం అధికారులు భారీ ఎత్తుల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులను స్వామిని దర్శించేందుకు అనుమతించనున్నారు.