- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నడకతో ఆరోగ్యం.. రోజూ ఎంత సేపు నడవాలంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : నడక అనేది ఆరోగ్యానికి మంచిది. నడకతోనే మానవ ప్రయాణం మొదలైంది. మానవుడు చెట్లు, పుట్టలూ దాటుకుంటూ ప్రపంచాన్ని చూసేందుకు ముందుకు సాగాడు. కానీ, ప్రస్తుతం సమాజం మారుతుంది. కొత్త టెక్నాలజీతో మానవుడు నూతన విధానాలను అవలంభిస్తున్నాడు. కొంచెం దూరం వెళ్లడానికి కూడా మోటారు వాహనాలను ఉపయోగిస్తున్నాడు. ఇలా నడవడం వదిలేసి చిన్న అవసరాలకు కూడా వాహనాలు ఉపయోగించడం వలన వారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడున్న బిజీ రోజుల్లో నవడం వలన ప్రయోజనం ఏంటీ ? రోజు ఎంత సేపు నడవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నడక అన్నది మన శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడస్తుంటే శరీరంలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి. శరీరంలో ఉండే పనికిరాని కొవ్వు కరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నడక సాగిస్తుంటే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి, ఊబకాయం తగ్గుతుంది. ప్రాతఃకాలంలో వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది. అందుకే డాక్టర్లు చెబుతున్నారు రోజూ కనీసం 15 నుంచీ 30 నిమిషాలు నడవమని. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, వర్క్ టెన్షన్లలో బీజీ అయినా మనం 15 నిమిషాలు నడిస్తే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నడవడం వలన ప్రయోజనాలు..
-
మంచి నడక వలన రక్తప్రసరణ పనితీరు బాగుంటుంది. దాని వలన మెదడు ఆరోగ్యంగా, ఉంటూ, ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు నడక దోహదం చేస్తుంది.
-
నైజీరియా మెడికల్ జర్నల్ లో వచ్చిన దాని ప్రకారం కేవలం 15నిమిషాల నడక వల్ల జీవక్రియ సంబంధ ఇబ్బందులు 29శాతం తగ్గుతున్నాయి.
-
పరుగుతో కలిగే ప్రయోజనాలు నడకతోనూ కలుగుతాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ తెలిపింది. గుండె నొప్పి, ఇతర గుండె జబ్బులు రాకుండా నడక కాపాడుతుంది. రక్త సరఫరా కూడా మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.
-
ప్రతీరోజూ పదిహేను నిమిషాల నడక మీ జీవితకాలాన్ని పెంచుతుంది. పరుగులాంటి నడక మీ జీవిత పరుగును మరింత పెంచుతుంది.