రంగారెడ్డి జిల్లాలో 87 వేల మంది వలస కార్మికుల గుర్తింపు

by Shyam |
రంగారెడ్డి జిల్లాలో 87 వేల మంది వలస కార్మికుల గుర్తింపు
X

దిశ, రంగారెడ్డి: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నేటి వరకు 87,433 మంది వలస కార్మికులకు ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేశామని కలెక్టర్ అమయ్ కుమార్ తెలిపారు. రెండు విడతలుగా జరిపిన సర్వే‌లో మొత్తం 1,05,932 మంది వలస కార్మికులున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు. తొలి విడుత సర్వేలో గుర్తించిన 37,894 మందికి బియ్యం, నగదును పంపిణి చేశామన్నారు. రెండో విడత చేసిన సర్వేలో 68,038 మందిని గుర్తించగా.. నేటి వరకు 49,539 మందికి బియ్యం పంపిణి చేయగా.. 49,140 మందికి నగదును అందించామని కలెక్టర్ తెలిపారు.

Tags: migrant workers, rangareddy, ration distribution, collector

Advertisement

Next Story