నాకు 73 ఏళ్ళు.. నాకో ఫిట్ గా ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి

by Shyam |   ( Updated:2021-03-29 05:23:42.0  )
నాకు 73 ఏళ్ళు.. నాకో ఫిట్ గా ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి
X

దిశ, వెబ్ డెస్క్: వార్తా పత్రికల్లో ఎప్పుడు ఏదో ఒక ప్రకటన చూస్తూనే ఉంటాం. జాబ్ ప్రకటనలు , పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, వివాహ మాట్రిమోనీ నుండి వధువు కావలెను, వరుడు కావలెను లాంటి ప్రకటనలు నిత్యం వస్తూనే ఉంటాయి. అయితే ఎలాంటి ఒక పత్రికలో ఒక ఆసక్తికరమైన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక 73 ఏళ్ళ బామ్మ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చింది. మైసూర్ కి చెందిన ఒక వృద్ధురాలు ఇటీవలే తన భర్త నుండి విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆ బామ్మ ఒంటరి అయిపోయింది. దీంతో తనకో తోడు కావాలని అనుకుంది. ఆ తోడు కోసం వెతుకుతూ పత్రికా ఆఫీస్ కి వెళ్లి ఒక ప్రకటన ఇచ్చింది.

నాకు 73 ఏళ్ళు.. నాకో తోడు కావాలి. ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నా శేష జీవితాన్ని నాకిష్టమైన వ్యక్తితో గడపాలనుకుంటున్నా. నాకన్నా వయసులో పెద్దవాడై ఉండి.. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే నన్ను పెళ్లిచేసుకోవచ్చు అని ప్రకటన ఇచ్చింది. అంతేకాకుండా తనది బ్రాహ్మణ కులం కాబట్టి తనకు కాబోయే వాడు కూడా అదే కులానికి చెందిన వాడు కావాలని షరతు కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పేపర్ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు బామ్మ పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story