- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంటల్లో దూకి చెల్లెని కాపాడిన అన్న
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాకు చెందిన ఆరేళ్ల బాలుడు బ్రిడ్జర్ వాకర్.. తన చెల్లిని కాపాడుకునే క్రమంలో ప్రాణాలకు తెగించి కుక్కపై ఎదురు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ విరోచిత పోరాటంలో బాలుడి ముఖంపై 90 కుట్లు పడగా, ఆ చిన్నోడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగొచ్చాడు. కాగా ఇప్పుడు అమెరికా, టెన్నెస్సీకి చెందిన ఏడేళ్ల బాలుడు ఎలీ డేవిడ్సన్ కూడా అలాంటి సాహసమే చేశాడు. ఇంటిని చుట్టుముట్టిన మంటల్లోంచి దూకి, తన 22 నెలల చెల్లిని కాపాడుకున్నాడు. సోషల్ మీడియావ్యాప్తంగా ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎలీ పేరేంట్స్ క్రిస్, నికొలె డేవిడ్సన్ దంపతులు తమ ముగ్గురు పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఇల్లంతా పొగలు వ్యాపించడంతో ఒక్కసారిగా నిద్రలేచిన నికొలెకు ఏమీ అర్థం కాలేదు. అతడు చూస్తుండగానే ఇల్లంతా మంటలు వ్యాపించడంతో అప్రమత్తమై, వెంటనే తన పిల్లల దగ్గరకు పరుగెత్తాడు. కానీ పాప ఊయల చుట్టూ మంటలు చెలరేగి, పొగ కమ్మేసింది. దీంతో ఆ చిన్నారి పాపను అక్కడే వదిలిపెట్టి, మిగతా ఇద్దరు పిల్లలను (ఎలి, ఎలిజా), భార్యను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తర్వాత బయట ఉన్న కిటికీ ద్వారా కూతురును రక్షించడానికి ప్రయత్నించినా నికొలెకు సాధ్యంకాలేదు. అంతలోనే ఏడేళ్ల ఎలి మాత్రం ఆ కిటికీ ద్వారా మంటల్లో దూకి, తన చెల్లిని ఊయల నుంచి ఎత్తుకుని వచ్చేశాడు. తన చెల్లి ప్రాణాలు కాపాడిన ఎలీని చూసి అతడి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతుండగా, ఆ బాలుడి సాహసానికి స్థానికులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే 20 మంది ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకునేలోపే భవనం మొత్తం కూడా మంటల్లో కాలిపోయింది.