నల్గొండలో 7కు చేరిన కరోనా పాజిటివ్

by vinod kumar |
నల్గొండలో 7కు చేరిన కరోనా పాజిటివ్
X

దిశ, న‌ల్ల‌గొండ‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. న‌ల్ల‌గొండ‌ జిల్లాలో శుక్ర‌వారం నాటికి ఈ కేసుల సంఖ్య 7కు చేరింది. మిర్యాల‌గూడ డివిజ‌న్ ప‌రిధిలోని దామెర‌చ‌ర్ల‌కు చెందిన ఓ మ‌హిళ ఢిల్లీ జరిగిన మ‌ర్క‌జ్‌ ప్రార్థనలకు వెళ్లి వ‌చ్చింది. అధికారులు ఆమెను సోమ‌వారం హైద‌రాబాద్ ఫీవ‌ర్ ఆస్పత్రికి త‌ర‌లించి, ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో వైద్యం అందించారు. ఆ మహిళకు ఆరోజు క‌రోనా ల‌క్ష‌ణాలు వెలువడలేదు. ఆ తర్వాత గురువారం మ‌రోసారి ఆమె ర‌క్తం శాంపిల్స్ సేక‌రించి ప‌రీక్షించ‌గా క‌రోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ రిపోర్టును వైద్య ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి జిల్లా డీఎంహెచ్‌వో కొండ‌ల్‌రావుకు రిపోర్టు పంపించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అధికారులు ఆమె కుటుంబ స‌భ్యుల‌తో పాటు వారితో సన్నిహితంగా ఉన్న 10 మందిని ప‌రీక్ష‌ల నిమిత్తం నల్ల‌గొండ ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. వారి ర‌క్తం శాంపిల్స్ సేక‌రింంచి, 14 రోజుల పాటు ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో క్వారంటైన్ చేయ‌నున్న‌ట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన దామెర‌చ‌ర్ల‌లో లాక్‌డౌన్ ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నట్టు వైద్య అధికారులు స్పష్టంచేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా పోలీసులు నిరంతరం బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Tags : corona, 7 positive cases, lockdown, fever hospital

Advertisement

Next Story

Most Viewed