కన్నెపల్లి పంప్‌ హౌజ్‌లో ప్రమాదం

by Shyam |

దిశ, కరీంనగర్ :
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని లక్ష్మీ( కన్నెపల్లి) పంపుహౌస్‌లో గురువారం ప్రమాదం జరిగింది. ఫోర్ బే, మోటర్ల మధ్య గల ఒకటవ గేట్ వద్ద క్రేన్ సాయంతో సిమెంట్ ప్లాస్టరింగ్, పేయింటింగ్ పనులు చేస్తుండగా తాడు తెగిపడటంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులంతా మహరాష్ట్రలోని సిరోంచ తాలుక వాసులని సమాచారం. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed