ఇటలీలో కరోనా మరణ మృదంగం

by vinod kumar |
ఇటలీలో కరోనా మరణ మృదంగం
X

దేశాలకు దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నా కరోనా కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13వేలకు చేరింది. బాధితుల సంఖ్య మూడు లక్షలపైనే ఉంటుందని సమాచారం. ఇక ఇటలీలో కరోనా మరణ మృదంగం చేస్తుంది. ఆదివారం ఒక్క రోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇటలీ మొత్తం మరణాల సంఖ్య 5,500కు పెరిగింది. ప్రాన్స్ లో 562 మంది, స్పెయిన్ లో 394 మంది కరోనాతో తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌లో కరోనా ముప్పుతో 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.
అమెరికాలోనూ కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే కొత్తగా ఏడువేల కేసులు నమోదు కావడంతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 26,574కు చేరింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని చైనాలో ఆదివారం తొలి కేసు నమోదైంది. కొత్తగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3261కి చేరుకుంది.

Advertisement

Next Story