ఆరుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి

by Shyam |
ఆరుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి
X

దిశ, న్యూస్‌ బ్యూరో: 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారందరికీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) రేంజ్ హోదాను కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. ఐపీఎస్ -2006 బ్యాచ్‌కు చెందిన కార్తకేయను నిజమాబాద్ కమిషనర్‌గా, కె.రమేష్ నాయుడును తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా, వి.సత్యనారాయణను రామగుండం కమిషనర్‌గా, బి.సుమతి, ఎం.శ్రీనివాసులను సీఐడీ డీఐజీలుగా, ఏ.వెంకటేశ్వర్ రావును సైబరాబాద్ జాయింట్ సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags: Ips Officers, promotion, Chief Secretary, Directions, 2006 batch

Next Story

Most Viewed