ఐఐటీ జోధ్‌పూర్‌లో 52మంది విద్యార్ధులకు కరోనా

by Shamantha N |   ( Updated:2021-04-03 20:44:32.0  )
ఐఐటీ జోధ్‌పూర్‌లో 52మంది విద్యార్ధులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌కు చెందిన 52 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ప్రాక్టికల్‌ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో అధికారులు విద్యార్థులందరినీ ఐఐటీ క్యాంపస్‌లోని ఓ హాస్టల్‌ భవనంలో ఐసోలేషన్‌లో ఉంచారు.

ఈ సందర్భంగా ఐఐటీ ప్రతినిధి అమర్‌దీప్‌ శర్మ మాట్లాడుతూ.. వైరస్‌ బారినపడిన, ఇతర విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పనిసరిగా ప్రాక్టికల్స్‌ కోసం హాజరు కావాల్సి ఉండగా.. వారంతా ఇనిస్టిట్యూట్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారంతా కరోనా బారినపడ్డారని అన్నారు.

Advertisement

Next Story