అమెరికాలో ఒక్కరోజే 4,491 మరణాలు

by vinod kumar |
అమెరికాలో ఒక్కరోజే 4,491 మరణాలు
X

వాషింగ్టన్: అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొవిడ్-19 బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఈ దేశంలో రోజురోజుకూ రెట్టింపవుతోంది. ఈ మహమ్మారి ధాటికి గురువారం ఒక్కరోజే 4,491 మంది మృతి చెందారు. ఇలా.. ఒకదేశంలో ఒకేరోజు ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అయితే, గురువారం ప్రకటించిన మృతుల సంఖ్యలో కరోనా అనుమానిత మరణాలనూ లెక్కించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కరోనా బారినపడి అమెరికా వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 34,562కు చేరగా, ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 12వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఈ వైరస్ సోకినవారి సంఖ్య 7లక్షలకు చేరువవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల్లో అమెరికానే మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇటలీ (22,170), స్పెయిన్ (19,516), ప్రాన్స్ (17,920) దేశాలు ఉన్నాయి.

Tags: corona, america, death count raise, italy, spain

Advertisement

Next Story