- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెగాస్టార్ నట ప్రస్థానానికి 42 ఏళ్లు
దిశ, వెబ్‌డెస్క్: సాధారణ పోలీసు కానిస్టేబుల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానం ఈరోజుతో 42 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్ల ఆయన సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట,సుఖాలు, అవమానాలు చవిచూసి నేడు తెలుగు చిత్ర పరిశ్రమను రూల్ చేసే స్థాయికి ఎదిగాడు. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి హీరోగా ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా, కమెడీయన్, విలన్‌గా అనేక పాత్రలు చేశారు.
ఆయన నట ప్రస్థానంలో ఆయన ఎదుగుదలకు ఉపయోగ పడే సినిమాలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే, సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కూడా సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అప్పటివరకూ తెలుగు సినిమాకు రెండు కళ్లుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లను సైతం వెనక్కి, తనదైన శైలిలో దూసుకొచ్చాడు. ఇంద్ర, స్టాలిన్, ఠాగూర్ వంటి సినిమాలతో చరిత్ర సృష్టించాడు. సైరా వంటి చిత్రంతో మరుగున పడ్డ చరిత్రను వెలికి తీసాడు