ఏపీలో తాజాగా ఎన్ని కేసులంటే ?

by srinivas |   ( Updated:2021-06-26 06:44:15.0  )
AP corona Update
X

దిశ,వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో తాజాగా4,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,75,622 చేరింది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నిన్న 38 మంది ప్రాణాలు విడిచారు. అదే సమయంలో 5,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,566కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 46,126 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story