తౌక్టే ఎఫెక్ట్: సముద్రంలో చిక్కుకున్న 400 మంది…

by Anukaran |
తౌక్టే ఎఫెక్ట్:  సముద్రంలో చిక్కుకున్న 400 మంది…
X

ముంబై: అరేబియా సముద్రంలో తౌక్టే తుఫాన్ రౌద్రరూపాన్ని ప్రదర్శిస్తున్నది. గుజరాత్ వైపు ప్రయాణిస్తూ ప్రస్తుతం మహారాష్ట్ర తీరంలో బీభత్సం సృష్టిస్తు్న్నది. ఫలితంగా మహారాష్ట్ర తీరానికి పదుల కిలోమీటర్ల దూరంలో 410 మంది ప్రమాదకరపరిస్థితుల్లో చిక్కుకున్నారు. రక్షించాలని ప్రార్థిస్తూ వీరి నుంచి అత్యవసర సందేశాలు రాగానే నేవీ దళాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ కొచ్చిలు సహాయక చర్యల్లో భాగంగా బాధితుల దగ్గరకు బయల్దేరాయి.

ముంబై తీరం నుంచి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో బాంబే హై రీజియన్‌లో ఉన్న పీ305 బార్జ్(సమతలంతో ఉండి సరుకులను రవాణా చేయడానికి అనువుగా ఉండే నౌక)పై 273 మంది చిక్కుకున్నారు. వీరికోసం ఐఎన్ఎస్ కొచ్చి బయల్దేరింది. ఐఎన్ఎస్ తల్వార్ కూడా సంసిద్ధంగా ఉన్నది. ముంబై నుంచి 8 నాటికల్ మైళ్ల దూరంలో 137 మందిని మోస్తున్న గాల్ కన్‌స్ట్రక్టర్ బార్జ్ నుంచీ అత్యవసర సందేశం వచ్చింది. ఐఎన్ఎస్ కోల్‌కతా వీరి కోసం బయల్దేరింది. తౌక్టే ద్వారా ముప్పు ఎదుర్కొంటున్న మరికొందరి దగ్గరికి ఇతర నౌకలూ సహాయక చర్యలకు సిద్ధమవుతున్నాయని ఇండియన్ నేవీ అధికారి వెల్లడించారు.

Advertisement

Next Story