ఏపీకి కేటాయించిన కరోనా డోసులెన్నంటే?

by srinivas |
ఏపీకి కేటాయించిన కరోనా డోసులెన్నంటే?
X

దిశ, ఏపీబ్యూరో : కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి రాష్ట్రానికి 4.99 వైల్స్​ను కేంద్రం కేటాయించింది. ఇందులో సీరమ్‌కు చెందిన వ్యాక్సిన్​ వైల్స్ 4.77 లక్షలు మంగళవారం గన్నవరంలోని సెంట్రల్ స్టోర్‌కు చేరవేశారు. వీటిల్లో 320 వైల్స్ పుదుచ్చేరికి కేటాయించారు. భారత్ బయోటెక్ నుంచి రావాల్సిన 20వేల వైల్స్ బుధవారం ఏపీకి చేరనున్నాయి.

గన్నవరంలోని సెంట్రల్ పాయింట్ నుంచి రీజనల్ సెంటర్లు కర్నూలు, కడప, గుంటూరు, వైజాగ్ పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతీయ కేంద్రాల నుంచి 13జిల్లాల్లోని వ్యాక్సిన్​ కేంద్రాలకు తరలిస్తారు. అనంతరం వాటిని 1,659 కింది స్థాయి వ్యాక్సిన్​ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు.

Advertisement

Next Story