ఉమ్మడి నిజామాబాద్‌లో 34 కేసులు, ఆరుగురి మృతి

by Shyam |
ఉమ్మడి నిజామాబాద్‌లో 34 కేసులు, ఆరుగురి మృతి
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. తాజాగా 34మంది కరోనా బారిన పడగా, ఆరుగురు వైరస్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో నిజామాబాద్ కరోనా ఆస్పత్రిలో నలుగురు చనిపోగా, కామారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్ధరు మృతి చెందారు. బుధవారం నిజామాబాద్‌లో 43 శాంపిళ్లలో 33మందికి నెగెటివ్ రాగా, 13 పాజిటివ్ అని తేలింది. కామారెడ్డి జిల్లాలో 21 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

నిజామాబాద్ పట్టణంలోని బురుడు గల్లికి చెందిన(56) ఏండ్ల వ్యక్తికి, హబీబ్ నగర్‌కు చెందిన (68) ఏండ్ల వృద్ధుడు, కంఠేశ్వర్‌కు చెందిన (35) ఏండ్ల వ్యక్తి, ఏల్లారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన (45) ఏండ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 281కి చేరింది. కామారెడ్డిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200లకు చేరువయ్యాయి. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన (54) ఏండ్ల వ్యక్తి, పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన గర్భిణి(30) వైరస్‌తో చికిత్స పోందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, లాక్‌డౌన్ సమయంలో కామారెడ్డిలో మొత్తం 12 కేసులు తేలగా, ఆన్‌లాక్ తర్వాత 179 కేసులు పాజిటివ్ వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed