నిజామాబాద్‌లో 32 పాజిటివ్ కేసులు

by Shyam |
నిజామాబాద్‌లో 32 పాజిటివ్ కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉధృతిని కొనసాగిస్తుంది. సోమవారం జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లు ఉన్నవారికి ఈ పాజిటివ్‌లు వెలుగు చూశాయి. దీంతో నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 417కు చేరింది. కామారెడ్డి జిల్లాలో 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లా వైద్యాధికార యంత్రాంగం జిల్లా హెల్త్ బులిటెన్‌ను నిలిపేయడం గమనార్హం.

Advertisement

Next Story