300క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

by Sumithra |
300క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, ఎల్బీనగర్: అక్రమంగా నిల్వచేసి డీసీఎంలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 300 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని బుధవారం సరూర్ నగర్ సర్కిల్ సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. సరూర్ నగర్ సర్కిల్ ఏఎస్ఓ బాల సరోజ కథనం ప్రకారం..ఎల్బీనగర్, శివరాంపురం కాలనీలో కొంతమంది నిర్వాహకులు కలిసి 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ గోదాములో నిల్వ ఉంచారు. వాటిని బస్తాల్లో నింపి కర్ణాటకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన పక్కా సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు, రంగారెడ్డి జిల్లా డిఎస్ఓ ఎం.కె.రాథోడ్, ఏఎస్ఓ కె.వై.ఎల్. నర్సింహారావు, సీనియర్ ఇన్ స్పెక్టర్ రాజు, సరూర్ నగర్ సర్కిల్ ఏఎస్ఓ బాలసరోజతో కలిసి గోదాముపై అకస్మాత్తుగా దాడులు చేశారు. ఆ సమయంలో అక్కడున్న నిర్వాహకులు దాదాపు 15మంది అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం డీసీఎంతో పాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ..ప్రభుత్వం పేదలకు గత రెండు నెలలుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే కొంతమంది రేషన్ కార్డు దారులు బియ్యం తీసుకొని అక్రమార్కులకు ఎక్కువ రేటుకు అమ్ముకోవడం బాధాకరమని తెలిపారు. అలా చేయడాన్ని తాము నేరంగా పరిగణిస్తామని, ఇకమీదట బియ్యం కొనుగోలు చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed