- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయివర్ధన్‌ను మింగేసిన బోరుబావి
దిశ, మెదక్: పొడ్చనపల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయినవాళ్లు చూస్తుండగానే సాయివర్ధన్ అగాథ కూపంలాంటి బోరుబావిలో జారిపోయాడు. రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విగతజీవిగా పైకి వచ్చాడు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆక్సిజన్ పైపులను బోరు బావిలోకి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. అయినా ఫలితం లేకపోయింది.
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇలాంటి ఘటనే ఉమ్మడి జిల్లాలోని బొమ్మారెడ్డి గూడెంలో చోటు చేసుకుంది. 2015 నవంబర్ లో అన్న బాలేష్‌తో కలిసి ఆడుకుంటున్న మూడేళ్ల రాకేష్ బోరుబావిలో పడిపోయాడు. ఒక్కసారిగా మృత్యు కుహరంలోకి కూరుకుపోయాడు. అప్పటి వరకు నవ్వుతూ.. తుళ్లుతూ గడిపిన తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలేశ్… అమ్మా అంటూ కేకలేశాడు. తల్లి వచ్చేసరికే లోలోపలికి వెళ్లిపోయాడు. బిడ్డా కొంచెం కనిపిస్తూనే ఉన్నా… బయటికి లాగలేని పరిస్థితి ఆమెది. చూస్తుండగానే మరింత లోతుకు జారిపోయాడు. సరిగ్గా అదే తరహాలో తన అయినవాళ్లందరూ సమీపాన ఉండగానే సాయివర్ధన్ బోరు బావిలో పడిపోయాడు. సాగు నీటికోసం సాయివర్ధన్ తాత వేయించిన బోరు చుక్క నీటిని పుట్టించలేదు సరికదా.. చివరికి సాయివర్ధన్‌ను బలి తీసుకుని కన్నీటి చుక్కల్ని మిగిల్చింది.