హైదరాబాద్‌కు 3 జాతీయస్థాయి అవార్డులు..

by Shyam |
హైదరాబాద్‌కు 3 జాతీయస్థాయి అవార్డులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరానికి మూడు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ),డిపార్టు మెంట్ ఆఫ్ కామర్స్, ఎగ్జిబిషన్స్ ఇండియా గ్రూప్(ఈఐజీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ కన్వర్జెన్స్ ఇండియా-2021 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, 6వస్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పో ను ఈనెల 24 నుంచి 26 వరకు నిర్వహించారు.

హైదరాబాద్‌లో క్లీన్, గ్రీన్ సిటీ, మున్సిపల్లో వ్యర్థాల నిర్వహణ, వీహబ్ చేస్తున్న సేవలను గుర్తించిన స్మార్ట్ సిటీస్ ఇండియా అవార్డులను శుక్రవారం అందజేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన హెచ్‌జీసీఎల్ ఎండీ బీఎం సంతోష్, జీహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ అదనపు కమిషనర్ బి.సంతోష్, ఎన్.ఐ.యు.యం. అవుట్ రీచ్ మేనేజర్ కొండూజు వంశీ అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ, నగరాలు జీవించుటకు అనుకూలంగా మార్చి ఆర్థికంగా బలోపేతం చేయడమే స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా లక్ష్యమన్నారు. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌తో పనిచేస్తున్న వ్యక్తులు, విధాన రూపకర్తలు, కంపెనీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థలు, అసోసియేషన్లను గుర్తించి ప్రోత్సహించేందుకై స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్ ఫో వినూత్న వేదికగా నిలుస్తుందన్నారు.

గత ఐదేళ్లలో 800పై బడిన ఎంట్రీలను పరిశీలించి ప్రతిష్టాత్మక అవార్డులు అందజేశామని తెలిపారు. ఈ ఏడాది వివిధ విభాగాల నుంచి 586 దరఖాస్తులు వచ్చాయని 10మంది జ్యూరీ కమిటీ సభ్యులు పరిశీలించి సిఫార్సు చేసిన వాటికి అవార్డులు అందజేశామన్నారు. హైదరాబాద్ లో హెచ్ఎండీఏ, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ నాలాల కూడలి బేగంపేట ఫ్లై ఓవర్ కింద రెయిన్ గార్డెన్ అభివృద్ధి, సుందరీకరణ కు అవార్డు అందజేశామన్నారు.

దేశంలోనే అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన పర్యావరణ అనుకూలమైన వైద్య సామాజిక కార్యకర్తలతో చెత్త సేకరణ, రవాణా వ్యవస్థ, వ్యర్థాల రవాణా కోసం స్మార్ట్ వాహనాలు, పోర్టబుల్ సెల్ప్ కాంపాక్టర్లు, హెర్మెటిక్లీ సీల్ వేస్ట్ కంటైనర్లను హైదరాబాద్‌లో వినియోగించడం మొదటిసారి అని, అందుకే అవార్డు అందజేశామన్నారు. వీహబ్‌తో మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మహిళలు ఆర్ధికంగా ప్రోత్సహించడానికి వేదికగా వీహబ్ పని చేస్తున్నందున అవార్డును అందజేసి మరింత ప్రోత్సాహం అందజేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story