ప్రాణాలు తీసిన స్మిమ్మింగ్ సరదా..

by Shyam |

దిశ, వరంగల్
లాక్‌డౌన్‌లో నేపథ్యంలో స్మిమ్మింగ్ సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది.ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని కత్తి గూడెంలో సోమవారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..కత్తిగూడెంకు చెందిన యశ్వంత్ (12),ముచ్చపోతుల వీరేందర్ (12) అనే ఇద్దరు విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు మల్లయ్య కుంటకు వెళ్లారు. వీరికి స్మిమ్మింగ్ రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story