దేశంలో కొత్తగా 29,164 కరోనా కేసులు

by Shamantha N |   ( Updated:2020-11-17 00:37:30.0  )
దేశంలో కొత్తగా 29,164 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 29,164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,74,291కి చేరింది. తాజాగా 40,791 మంది వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 82,90,371 చేరింది. కొత్తగా దేశవ్యాప్తంగా 449 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,30,591 కు చేరింది. దేశంలో రికవరీ రేటు సుమారు 93.42 శాతానికి చేరింది.

Advertisement

Next Story