- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అంతేగాకుండా.. ఈ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.
కాగా, మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణం తర్వాత మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్య తెలంగాణలోని ములుగులో పోలీసుల ఎన్ కౌంటర్‌లో ముగ్గురు కీలక నేతలు చనిపోగా, ఉత్తరాదిలో పలువురు సీనియర్ నేతలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లోనూ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లింది.
Advertisement
Next Story