Gold Price: సోమవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

by Harish |   ( Updated:2021-01-24 20:47:23.0  )
Gold Price: సోమవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండిధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పోటీపడుతున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
శనివారం (23-01-21) రోజు తగ్గిన బంగారం ధరలు ఎలా ఉన్నాయో సోమవారం మార్కెట్ ప్రారంభంలో అలాగే కొనసాగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి రూ.45,940కి నమోదైంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330కి తగ్గింది. దీంతో రూ. 50,120వద్ద నమోదైంది. విజయవాడ, వైజాగ్‌లలో బంగారం ధర 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ.45,940 వద్ద నమోదైంది. చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ. 50,120కి చేరుకుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160కి తగ్గి రూ.48,090 వద్ద నమోదైంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170కి తగ్గి రూ. 52,460కు చేరుకుంది.
ఇక దేశంలో మెట్రోనగరాల్లో కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరకంటె రూ.100 రూపాయలు తగ్గింది. దీంతో సోమవారం వెండి ప్రారంభ ధర కేజీకి రూ.71,300 చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed