కర్ణాటకలో 24 మంది రోగులు మృతి

by Shamantha N |   ( Updated:2021-05-03 01:28:26.0  )
కర్ణాటకలో 24 మంది రోగులు  మృతి
X

బెంగళూరు: కర్ణాటకలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చామరాజనగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 24 మంది రోగులు మృతి చెందారు. కాగా ఆక్సిజన్ కొరతతోనే వారంతా మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం దీన్ని తోసి పుచ్చుతున్నారు. కాగా ఘటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సురేశ్ కుమార్ ఆస్పత్రికి చేరుకున్నారు. వారంతా ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నట్టు తెలిపారు. మృతుల బంధువులతో మాట్లాడామని చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు. డెత్ ఆడిట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అలానే రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed