- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగ్గురు భార్యలున్నా నాలుగో పెండ్లికి సిద్ధమయ్యాడు..
దిశ, వెబ్‌డెస్క్: ‘వద్దురా సోదరా..పెళ్లంటే నూరెళ్ల మంటరా’ అని పాడుకున్నా, ‘డోంట్ మ్యారీ, బీ హ్యాపీ’ అని కేకలు వేసినా, చివరకు పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం. అయితే ఓ వ్యక్తి మేజర్ కాకుండానే తన మొదటి పెళ్లి చేసుకున్నాడు. ఇక పాతికేళ్లు కూడా నిండకముందే మరో ఇద్దరికీ భర్తయ్యాడు. ముగ్గురు భార్యల ముద్దుల మొగుడిగా సంసారం చేస్తున్న ఆ వ్యక్తి వారి సహకారంతోనే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఏంటీ నాలుగో పెళ్లా? అని ఆశ్చర్యపోతున్నారా? అన్ని పెళ్లిల్లు చేసుకుంటే చట్టాలు ఏం చేయవా? అంటే అతడికి భార్యల ఫుల్ సపోర్ట్ ఉంది మరి. అంతేకాదు నాలుగో భార్యను వెతికే బాధ్యత కూడా ఆ ముగ్గురు భార్యలే తీసుకున్నారు. ఇంతకీ ఆ లక్కీ భర్త ఎవరో? తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..
ఈ కాలంలో పెళ్లికి అమ్మాయిలు దొరకడమే గగనమై పోతుంటే, పాకిస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల అద్నన్ మాత్రం ముగ్గురు భార్యలతో హ్యాపీగా జీవిస్తూనే నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు. అద్నన్ 16 ఏళ్ల వయస్సులో మొదటి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత మరో పెళ్లి చేసుకున్నా అద్నన్, గతేడాది ముచ్చటగా మూడో షాదీ చేసుకున్నాడు. ఈ ముగ్గురు భార్యలు అద్నన్‌తోనే కలిసి ఉంటున్నారు.
కానీ, ఒకరిమీద ఒకరికీ ఎలాంటి కంప్లయింట్స్ లేవు. కానీ, అద్నన్ తమతో అధిక సమయం గడపడం లేదని వారు చెబుతున్నారు. ఇక నెలకు కుటుంబ పోషణ కోసం లక్ష రూపాయల నుంచి 1.5 లక్షలు ఖర్చవుతుంది. పెళ్లి చేసుకుంటే తనకు అదృష్టం కలిసి వస్తుందని అందుకే మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని, ప్రతి సారి తనకు మంచే జరిగిందని అద్నన్ అంటున్నాడు.
‘‘నేను పెళ్లి చేసుకున్న ప్రతిసారి నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. నా భార్యల పేర్లు సుంబాల్, శబానా, షహీదా. ఈ ముగ్గురు పేర్లు ‘ఎస్’ అక్షరంతోనే మొదలవుతాయి. కాబట్టి, నా నాలుగో భార్య పేరు కూడా ‘ఎస్’తోనే మొదలు కావాలని కోరుకుంటున్నా’’ అని అద్నన్ తెలపడం విశేషం.