అంబులెన్స్ కెపాసిటి 2.. మృతదేహాలు 22

by Shamantha N |
ambulance
X

దిశ, వెబ్‌డెస్క్ : చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవప్రదంగా చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరి నిర్వాకం వల్ల అధికారులు అబాసుపాలవుతున్నారు. అంతిమ సంస్కారాలు కూడా అత్యంత అవమానకరంగా జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహారణ మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో జరిగిన ఘటనే. ఒకే అంబులెన్స్‌లో ఏకంగా 22 మృతదేహాలను తరలించి మానవత్వాన్ని మంట కలిపారు వైద్యసిబ్బంది.

బీద్ జిల్లాలోని అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ 22 మంది కరోనా పేషెంట్లు మృతిచెందారు. అయితే హాస్పిటల్‌కు తగినన్ని అంబులెన్స్‌లు సమకూర్చలేదన్న సాకుతో అధికారులు ఇలా 22 మంది మృతదేహాలను కుక్కి శ్మశానికి తరలించారు. శ్మశానంలో ఈ ఘటనను చూసిన బంధువులు ఇదేంటని ప్రశ్నించగా.. పోలీసులు వారి సెల్ ఫోన్లను లాక్కోవడంతోపాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ స్పందించారు.ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

కాగా, ఈ ఘటనపై స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ఆస్పత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర వివరణ ఇచ్చారు. ‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం?’ అని ఆయన వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed