2011 చరిత్రను టీమిండియా రిపీట్ చేయబోతోంది.. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు : అక్తర్‌

by Vinod kumar |   ( Updated:2023-10-16 11:46:07.0  )
2011 చరిత్రను టీమిండియా రిపీట్ చేయబోతోంది.. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు : అక్తర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో టీమిండియా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్‌.. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు 8 సార్లు పాకిస్తాన్‌ను భారత జట్టు ఓడించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్తాన్‌ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

2011 వరల్డ్‌కప్‌ విజయాన్ని పునరావృతం చేసే దిశగా టీమిండియా అడుగులు వేస్తుందని అక్తర్‌ కొనియాడాడు. ''భారత్‌ 2011 ప్రపంచకప్‌ చరిత్రను పునరావృతం చేయబోతోందని నేను నమ్ముతున్నాను. సెమీ-ఫైనల్స్‌లో వారు విజయం సాధిస్తే.. కచ్చితంగా ఛాంపియన్స్‌గా నిలుస్తారు. ప్రస్తుత భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. భారత జట్టు మమ్మల్ని ఓ పసికూనలా ఓడించింది. మా రోహిత్‌ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడని'' అక్తర్‌ పేర్కొన్నాడు.

Advertisement

Next Story