ICC World Cup 2023: ప్రపంచ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ పేసర్లు ఔట్

by Vinod kumar |   ( Updated:2023-09-21 16:18:36.0  )
ICC World Cup 2023: ప్రపంచ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ పేసర్లు ఔట్
X

న్యూఢిల్లీ : వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో సౌతాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఎన్రిచ్ నోర్జే, సిసంద మగల గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో నోర్జే వెన్ను గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత మైదానం వీడాడు. అలాగే, ఆసిస్‌తో మూడో వన్డేలో మగల మోకాలికి గాయమైంది. దాంతో వీరిద్దరూ ప్రపంచకప్‌కు దూరమయ్యారని సౌతాఫ్రికా వైట్ బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపాడు. అలాగే, వీరి స్థానాలను ఆండిలే ఫెఫ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్ భర్తీ చేస్తారని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లో వీరిద్దరూ సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించారు. కాగా, నోర్జే 2019 వరల్డ్ కప్‌కు కూడా గాయం కారణంగానే దూరమయ్యాడు. ప్రస్తుత తరంలో అత్యంత వేగవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒక్కడైన నోర్జేకు భారత్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాడు. అనుభవజ్ఞుడైన నోర్జే దూరం కావడం సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

Advertisement

Next Story

Most Viewed